►గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ పట్టణాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకొంది.
►పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలో రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్ర నాథ్ ఠాగూర్ 1863లో తొలుత ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు.
►దాన్ని 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ గురుకుల పాఠశాలగా మార్చారు.
►1921లో దీన్ని విశ్వభారతి పేరుతో విశ్వవిద్యాలయంగా మార్చారు.
► ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతినికేతన్ కు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు.
► శాంతినికేతన్‌ను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధాన మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
0 Comments