జగన్మాత పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే మూర్తిగా అందరి చేత పూజలందుకుంటాడు. ఎలాంటి కార్యాన్నయినా ప్రారంభించేముందు స్వామిని పూజించి ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. గడ్డిపరక సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకే ఉబ్బితబ్బిబ్బయిపోతాడు. బొజ్జగణపతి భక్త సులభుడు.శ్రద్ధగా తన వ్రతాన్ని నిర్వహించేవారిని.. సకల విఘ్నాల నుంచీ కాపాడతాడు, సర్వశుభాల్నీ ప్రసాదిస్తాడు.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ।।
అయం ముహూర్తః సుముహూర్తోస్తు... తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్
0 Comments