భారత దేశ ప్రజల అభ్యున్నతి కోసం.. అనేక చట్టాలు చేసిన పార్లమెంటు, ఎంతో మంది మేధావులు, విజ్ఞులు ప్రజల కోసం గళం వినిపించిన పార్లమెంటు పాత భవనంలో కార్యకలాపాలు నేటితో ముగియనున్నాయి. వర్తులాకారంలో రాజసం ఉట్టిపడేలా ఉండే.. భారత పార్లమెంటు దేశ చరిత్రకు వన్నె తెచ్చింది. అయితే, నూతనంగా నిర్మించిన పార్లమెంట్ లో రేపటి నుంచి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనం కాళి కానుంది. దీంతో ఈ భవనం ఇక చరిత్రగా మారనుంది. సుమారు 96 ఏళ్ల కిందట ఈ పార్లమెంటు భవనాన్ని అప్పటి బ్రిటీష్ పాలకులు నిర్మించారు. అప్పట్లో నిర్మించిన ఈ భవనం ఎంత పటిష్టమంటే.. ఇప్పటి వరకు ఎన్ని ప్రకృతి విలయాలు సంభవించినా.. చెక్కు చెదరకుండా ఠీవీగా నిలిచింది.
ఢిల్లీలోని రైసీనా హిల్ ప్రాంతంలో ఉన్న పాత పార్లమెంటు భవనాన్ని1927 జనవరి 18న అప్పటి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ భవనానికి 144 రాతి స్తంభాలు ఉన్నాయి. బ్రిటీష్ పాలకులు దీనికి ‘కౌన్సిల్ హౌస్’ అని పేరు పెట్టారు. పార్లమెంటు భవనం ప్లానింగ్ అంతా కూడా బ్రిటన్‌లో జరిగిందని చెబుతారు. పార్లమెంటు భవనం ఆర్టిటెక్టులుగా సర్ హెర్బెర్ట్ బేకర్, సర్ ఎడ్విన్ లు వ్యవహరించారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన భవంతుల్లో ఒకటిగా నిలిచిన భారత పార్లమెంటు భవనంలో చిట్ట చివరి సమావేశాలు నేడు జరుగుతున్నాయి
0 Comments