►తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజు సాయంత్రం ప్రారంభంకానున్నాయి.
►వాస్తవానికి ఆదివారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది.
►అయితే, నేటి సాయంత్రం ఆరు గంటల తరువాత మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు.
►ఈ నెల 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
►తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై తిరుమల మాఢవీధుల్లో విహరించనున్నారు.
►బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పటిష్ట భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలు ఏర్పాటు చేసింది.
►సాధారణ భక్తులకు పెద్ద పీట వేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
►బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఎలాంటి వీఐపీ పాసులను అనుమతించబోమని వెల్లడించారు.
0 Comments