హైదరాబాద్: రామ్‌చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అంటూ సాగే పాట ఆన్‌లైన్ వేదికగా లీకైంది. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఇది వైరల్ మారింది. సాంగ్ లీక్ కావడంపై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. పాటను లీక్ చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, వాట్సాప్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఈ పాటను షేర్ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
0 Comments